Skip to main content

Posts

Showing posts from May, 2018

చైనాలోను బాహుబ‌లి ప్ర‌భంజ‌నం

చైనాలోను బాహుబ‌లి ప్ర‌భంజ‌నం . ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి చెక్కిన బాహుబ‌లి శిల్పం రెండు పార్టులుగా విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌భాస్‌, రానా,త‌మ‌న్నా, అనుష్క‌, స‌త్య‌రాజ్, రమ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1600కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్ సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటేలా చేసింది. ఒక్క ఇండియాలోనే కాదు ప‌లు దేశాల‌లోను బాహుబ‌లి చిత్రం ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుపుకొని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇటీవ‌ల జ‌పాన్‌లో విడుద‌లైన బాహుబ‌లి 2 చిత్రం వంద రోజుల ర‌న్ పూర్తి చేసుకొని 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ ను రాబట్టింది. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో ఈ చిత్రం దిగ్విజయంగా నడుస్తోంది అయితే ఈ మూవీ రేపు చైనాలో ఐమాక్స్ ఫార్మాట్‌లో 7000ల‌కి పైగా స్క్రీన్స్‌లో విడుద‌ల కానుంది. అంటే స్క్రీన్ల ప‌రంగా దంగ‌ల్ రికార్డ్‌ని బ్రేక్ చేసిన బాహుబ‌లి 2 చిత్రం భ‌జ‌రంగీ భాయిజాన్ సినిమా రికార్డ్‌ని మాత్రం క్రాస్ చేయ‌లేక‌పోయింది. స‌ల్మాన్ న‌టించిన భ‌జ‌రంగీ భాయిజాన్ చిత్రం చైనాలో 8000ల‌కి పైగా స్క్రీన్స్‌లో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి 2 చిత్రం ప్రీ సేల్స్ ద్వా...